వైకాపా ఎమ్మేల్యే రోజాకు చేదు అనుభ‌వం-అడ్డుకున్న టిడిపి కార్య‌క‌ర్తలు

0
90

చిత్తూరూః చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది.బుధవారం పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.టీడీపీ నేత,మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్న సమయంలోనే ఈ దాడి ప్రయత్నం జరిగిందని,ఈ పని తెలుగుదేశం పార్టీ వారిదేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ కార్యక్రమానికి హాజరైన రోజా రాకను నిరసిస్తూ టిడిపి కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైకాపా కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.వారు ఆమె పైన దాడికి ప్రయత్నాలు చేయగా, వై.ఎస్‌.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.అంతకుముందు రోజా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు,సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.మొన్న టమోటా,ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారని,మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కారన్నారు. క‌ష్టించి పంట పండించిని రైతుకు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌లేక పోవ‌డం ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని రైతుల‌ను అదుకుంటాన‌ని మాటలు చెప్పుతూ,,గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంలో మెహం చాటేస్తున్న‌ర‌ని విమ‌ర్శించారు. రైతులు మామిడికాయలను రోడ్డుపై వేసి తమ నిరసన తెలిపే దుస్దితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY