జగన్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందాం-రాచమల్లు శివప్రసాదరెడ్డి

0
200

క‌డ‌పః వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని వై.ఎస్‌.ఆర్‌.సిపి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు . శ‌నివారం ప్రొద్దుటూరులో జ‌రిగిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అయ‌న మాట్లాడారు.2019లో మన ప్రభుత్వం వచ్చాక తాగునీటి పరిష్కారం, దోమలు లేని ప్రొద్దుటూరు, చేనేతల అభివృద్ధి కోసం పాటుపడమని జననేతను కోరుతున్నని చెప్పారు. స్వర్ణకారుల అభివృద్ధి కోసం పనిముట్లు ఇచ్చి ఆదుకోవాలిని, పక్కా ఇళ్లు కట్టించాలని కోరుతున్న‌ని తెలిపారు.రాష్ట్రంలో చేతగాని దద్దమ్మల పాలన కొనసాగుతోందని శివప్రసాదరెడ్డి మండిపడ్డారు.వైయస్ఆర్ బతికున్న రోజుల్లో ప్రొద్దుటూరుకు జరిగిన అభివృద్ధి తప్పితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి అన్నదే లేదన్నారు. రోశయ్య, కిరణ్ సర్కార్ మాదిరే బాబు సర్కార్ కూడ బంగాళాఖాతంలో కలవబోతుందన్నారు. ఒక్క ఇంటిని కాని,చుక్కనీరిచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విషజ్వరాలతో వందలాదిమంది చనిపోతుంటే పాలకులకు మనసు కరగడం లేదన్నారు. దివ్యంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రొద్దుటూరుకు పశువైద్యకళాశాల, యోగి వేమన ఇంజినీరింగ్ కాలేజీ, రింగ్ రోడ్డు, అమృతానగర్ లో పక్కా ఇళ్లు, చేనేతల కోసం 53 ఎకరాల భూమి, 350 పడకల పెద్దాసుపత్రి, రాజీవ్ నేషనల్ పార్కులాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజల్లో ఎండ‌క‌డుతున్న‌,అధినేత‌ జగన్ వెంట నడిచేందుకు ఇక్కడకు వచ్చిన వేలాదిమందికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చి, మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని విజ్ఞాప్తి చేశారు.

LEAVE A REPLY