త్రాగే నీళ్ల‌తో రాజికీయాలు చేస్తున్న మంత్రి-కాకాణి

0
49

నెల్లూరుః పొదలకూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు త్రాగునీరు అందకుండా అడ్డుకుంటూ,సోమిరెడ్డి ట్యాంకర్లతో మంచినీటిని అందించి ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నాడని,ప‌ట్ట‌ణం ఎప్ప‌టి నుండో వున్న గుర్ర‌పుబావి వ‌ద్ద పంచాయితీ నిధుల‌తో ఏర్పాటు చేసిన బోరు మోట‌ర్‌ను ప్రారంభించిన సంద‌ర్బంలో స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం మాట్లాడుతూ మంచి నీరు అందించేందుకు బోర్లు వేస్తే,వివాదాలు సృష్టిస్తూ, ప్రజలకు త్రాగునీరు అందకుండా అడ్డుకుంటున్న సోమిరెడ్డిని ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు.అధికారులను పారదర్శకంగా వ్యవహరించండి అంటూ ప్రశ్నిస్తే,మంత్రికి చెమటలు పడుతున్నాయని, అధికారులు అడ్డగోలుగా కాకుండా,పారదర్శకంగా వ్యవహరిస్తే,తన అవినీతి సంపాదనకు గండి పడుతోందని అయ‌న‌ ఆందోళన చేందుతున్న‌డ‌న్నారు.సాఫీగా లావాదేవీలు నిర్వహించుకోవడానికి,అధికారులు, కాంట్రాక్టర్లు లాంటి వాళ్లతో సమన్వయ పరచుకోవడానికి తన కుమారుడు రాజగోపాల్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించుకున్నాడ‌ని విమ‌ర్శించాడు.సోమిరెడ్డి,ఆయన కుమారుడు నోట్ల కట్టలు లెక్కించుకుంటూ, ప్రజల సమస్యలను పట్టించు కోకుండా,ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు.ప్రతిపక్ష శాసన సభ్యుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ, మంత్రి కొడుకు బ్యానర్ పట్టుకొని తిరగడం సిగ్గుచేటని,మంత్రి గుంపులు, గంపులుగా జనాన్ని పోగుచేసుకొని వచ్చినా, పోరాటానికి నేను ఒక్కడినే సిద్ధమేని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గానికి నాయకులను దిగుమతి చేస్తున్నమంత్రి, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను కూడా దిగుమతి చేస్తాడేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు. సోమిరెడ్డిలాంటి అవినీతి పరుడు,నెల్లూరు జిల్లాలో పుట్టడం,జిల్లా ప్రజల దౌర్భాగ్యమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY