టీడీపీ ప్ర‌భుత్వం ఆక్వారైతుల‌ను మోసం చేసింది-కాకాణి

0
168

నెల్లూరుః ఆక్వా రైతులకు కరెంటు చార్జీల బిల్లులోనే రూ. 2-00ల చొప్పున విద్యుత్ శాఖ వసూలు చేయాలి తప్ప,తిరిగి చెల్లింపుల పేరుతొ మభ్య పెట్టడం తగదని,చంద్రబాబు ఆక్వా రైతుల వద్ద యూనిట్ కు రూ.3-75 పైసల లెక్కన వసూలు చేసి,రూ.1-75 పైసలు తిరిగి చెల్లిస్తానని చెప్పడం,మాట తప్పడమేన‌ని స‌ర్వేపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి అన్నారు.శుక్ర‌వారం అయ‌న ఆక్వా రైతులతో క‌ల‌సి సర్వేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నాచేపట్టిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ చంద్రబాబు తీసుకున్ననిర్ణయం ద్వారా చెల్లింపులు రొయ్యల గుంటల యజమానుల ఖాతాలో పడితే, లీజుదారుల పరిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించాడు.అదనపు విద్యుత్ వినియోగం పేరిట డిపాజిట్లు రూ.3-75 పైసల చొప్పున విదిస్తే, రూ.2-00లకు తగ్గించినంత మాత్రాన రైతులకు ఒరిగే ప్ర‌యోజ‌నం ఏమిలేద‌న్నారు.చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న, రైతు వ్యతిరేక నిర్ణయాలే తప్ప,రైతులను ప్రోత్సహించే విధంగా ఆలోచన చేయలేదని,టీడీపీ ప్రభుత్వం రుణ మాఫీ పేరిట రైతులను మోసం చేసినట్లే,ఆక్వా రైతులను మరోసారి మోసం చేసిందని ఆరోపించారు.

LEAVE A REPLY