అధికారులు పక్షపాత వైఖరితో కాకుండా-పారదర్శకంగా విధులు నిర్వహించాలి-కాకాణి

0
73

నెల్లూరుః అధికారులను గౌరవిస్తాన‌ని,అవినీతికి,అక్రమాలకు పాల్పడేవారిని ప్రశ్నించడం ప్రజాప్రతినిధిగా త‌న‌ బాధ్యతని,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి తప్ప రాజకీయాలు పార్టీలు ప్రమేయం ఉంటే అభివృద్ధి కుంటు పడుతుందని స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి అన్నారు.బుధ‌వారం పొద‌ల‌కూరు మండ‌లం అయ్య‌గారిపాళెం గ్రామంలో సిమెంట్‌రోడ్డు ప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ అధికారంలో అభివృద్ధి చేయడం కన్నా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా పోరాటం చేసి ప్రజలకు అవసరమైన కనీస వసతి సదుపాయాలు కల్పిస్తున్నాట్లు తెలిపారు.అధికారులు పక్షపాత వైఖరితో కాకుండా పొరపాట్లు చేయకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు.దారులు తెలియని సోమిరెడ్డి పొదలకూరు ప్రాంతాన్ని మార్చేశానని,చెప్పడం హాస్యాస్పదమ‌ని,మంత్రి ఎన్నిసార్లు పొదలకూరు మండలంలో పర్యటిస్తే, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.రైతులకు సాగు నీరు అందిస్తానని సోమిరెడ్డి 20కోట్లు దొంగబిల్లులు చేయించుకొని,మరో 20కోట్లు దొంగ బిల్లుల రూపంలో అవినీతికి సిద్ధ పడుతున్నాడని,మిల్లర్ల దగ్గర 50 కోట్లు ముడుపులు తీసుకొని, రైతులకు ద్రోహం చేసిన చరిత్ర సోమిరెడ్డిదని ఆరోపించారు.రైతుల పేరు మీద అవినీతి సంపాదనకు, దోపీడికి పాల్పడుతున్న సోమిరెడ్డికి రైతులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని,అవినీతి బ్రతుకు బ్రతికే సోమిరెడ్డికి నన్ను విమర్శించే స్థాయి ఎక్కడుందని ప్ర‌శ్నించారు. సోమిరెడ్డి అవినీతికి ప్రశ్నిస్తే,కలెక్టరును చర్యలు తీసుకోమంటే,సోమిరెడ్డి ఉద్యోగ సంఘాలను,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలను రెచ్చగొడుతున్న‌ర‌ని,తెర వెనుక నాటకాలాడుతూ,తనపై ఆరోపణలను అధికారులకు ఆపాదిస్తున్న సోమిరెడ్డికి శృంగ భంగం తప్పదన్నారు.మంత్రి ప్రవర్తనతో,సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అయిదవ సారి సాగనంపడానికి సిద్ధంగా వున్నార‌న్నారు.

LEAVE A REPLY