సోమిరెడ్డి అవినీతికి అంతే లేకుండా పోయింది-కాకాణి

0
87

సోమిరెడ్డి నోటికి అడ్డూ-అదుపు ?
నెల్లూరుః సోమిరెడ్డి నిత్యం అధికారులను దూషిస్తూ,దుర్భాషలాడుతూ,బెదిరింపులకు,బ్లాక్ మెయిలింగ్‌ల‌కు పాల్పడుతున్నాడని,ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లు ఇవ్వకపోతే,స్థానిక అధికార పార్టీ నాయకులు భయ పెడుతున్నారని వైకాపా జిల్లా అధ్య‌క్షుడు,స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి అరోపించారు.గురువారం వైకాపా జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించి మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుండి అధికార పార్టీ నేతల జాబితా అధికారులకు అందించి, వాళ్ళకి పనులు మంజూరు చేయిస్తా, దొంగ బిల్లులు చేసి పెట్టమని సోమిరెడ్డి బెదిరిస్తున్నాడ‌ని,స్థానిక నాయకులు,సోమిరెడ్డి వ్యక్తిగత, ప్రయివేట్ వ్యవహారాల నిర్వహణకు మామూళ్లు వసూళ్లు తప్పనిసరి అని చెప్పుతున్నారని ఇదేనా పారద‌ర్శ‌క పాల‌న అంటు నిల‌దీశారు.నిజాయితీ కలిగిన మహిళా ఇంజినీరును “డోంట్ టాక్ రబ్బిష్” అని దూషించడం సోమిరెడ్డి సంస్కారానికి నిదర్శనమ‌న్నారు.మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్న సోమిరెడ్డి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం సహించలేని సివిల్ సప్లయిస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడడం,అందరికీ తెలిసిన విషయమేన‌న్నారు.ఫోర్జరీ తీర్మానంతో రూ.8 కోట్లతో జరిగే రోడ్ల నిర్మాణంలో సోమిరెడ్డి ముడుపులు తీసుకొన్నార‌ని,ఫోర్జరీ పట్టాలతో రైతుల నష్ట పరిహారాన్నిసోమిరెడ్డి కాజేయబోతే, రైతులు తెలుసుకొని,ఫిర్యాదు చేసినా కలెక్టరు పట్టించుకోలేదని అరోపించారు.ఇంత భారీ స్థాయిలో అవకతవకలు,అక్రమాలు జరుగుతుంటే, అసలు నెల్లూరు జిల్లాకు కలెక్టరు ఉన్నాడా లేక సోమిరెడ్డి, కలెక్టరులాగా వ్యవహరిస్తున్నాడా? అని అనుమానం కలుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఈ స‌మావేశంలో ఎమ్పీటిసి వెంట‌క‌శేష‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు

LEAVE A REPLY