సీజన్ కు నెల ముందే సాగునీటికి సమృద్ధిగా నీరు వదిలేలా ఏర్పాట్లు-కాకాణి

నెల్లూరు: ప్రధానంగా బండెపల్లి కాలువ ముఖ్యమంత్రి ys జగన్మోహన్ రెడ్డి చొరవతో మొదలవుతున్నాయని, కమిటీ వేయకుండానే పనులు ప్రారంభానికి నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నని ysrcp జిల్లా అధ్యక్షులు,సర్వేపల్లి mla కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.ఆదివారం నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం గురివిందుపూడి చెరువుకు సోమశిల జలాశయం నుండి విడుదల చేసిన సాగునీటిని రైతులతో కలిసి పరిశీలించిన సందర్బంలో అయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా సోమశిలకు నీరు వస్తోంది, దాని ద్వారా కండలేరుకు నీరు సమృద్ధిగా వస్తుందని,ప్రధానంగా ఇరిగేషన్ బోర్డ్ సమావేశం ఏర్పాటు చేసిన తరువాత నీటిని వదులుతారని అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం సీజన్ కు నెల ముందే సాగునీటికి సమృద్ధిగా నీరు వదిలే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పారుదల కాలువల్లో కొంత నీరు వృధాగా పోతుందని,గతంలో నీరు- చెట్టు పనులతో దోచుకోవడం తప్ప నీటి పారుదల కాలువలను పట్టించుకోలేదని మండిపడ్డారు. నియోజకవర్గములో శాశ్వత ప్రాతిపదికన రైతులకు సాగు నీరు అందే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.