జిల్లా పాల‌న గాడిత‌ప్పితే-ప్ర‌శ్నిస్తునే వుంటా-కాకాణి

0
73

నెల్లూరుః జిల్లాలో అధికార‌పార్టీనాయ‌కులు అవినితి,ఆశ్రిత‌పాక్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ర‌ని,మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ జిల్లా క‌లెక్ట‌ర్ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌ని అనుమానం మాకు క‌లుగుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తంచేయ‌డం జ‌రిగింద‌ని స‌ర్వేపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి తెలిపారు.శ‌నివారం వైకాపా జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ రెవెన్యూ సంఘ‌ల‌నాయ‌కులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి,తాను మాట్లాడిన ఆంశాల‌కు సంబంధం లేకుండా ఖండించ‌డం స‌బ‌బుకాద‌న్నారు.తాను జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను ఉల్ల‌ఘించార‌ని,దీనిపై హైకోర్టుకు వెళ్లడంతో,కోర్టు క‌లెక్ట‌ర్ ఇచ్చిన ఆర్డ‌ర్‌ను సంస్పెండ్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.రాందాసు కండ్రిగ భూముల‌కు సంబంధించి,మంత్రి సంత‌కం పెట్ట‌డ‌ని,స‌ద‌రు భూముల‌కు సంబంధించిన దొంగ ప‌ట్టాలు పుట్టించార‌ని,రైతుల‌కు వ‌చ్చే ప‌రిహ‌రం కాజేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే,మీడియా సాక్షిగా విష‌యాల‌పై క‌లెక్ట‌ర్‌కు వినతి ప‌త్రం అంద‌చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అధికారులు బాధ్య‌తల స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తే తాము గౌర‌విస్తాన‌ని,నిర్వ‌హించ‌లేక పోతే ప్ర‌జాప్ర‌తినిధిగా ప్ర‌శ్నిస్తానని తెలిపారు.
జిల్లా పాల‌న గాడి త‌ప్పింద‌ని,కేవ‌లం దానిపైనే మాట్లాడుతూన్న‌మ‌న్నారు.ప‌సుపు కుంభ‌కోణంలో అధికార‌పార్టీ నాయ‌కుల‌ను కాపాడేందుకు 18 మంది వి.ఆర్‌.ఓల‌ను క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేసిన‌ప్ప‌డు,సివిల్ స‌ప్ల‌య్స్ అధికారి క‌లెక్ట‌ర్ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసిన‌ప్పుడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్న‌య‌ని ప్ర‌శ్నించారు.ప్రోటోకాల్‌కు సంబంధించి ఉల్ల‌ఘ‌న జ‌రుగుతుంద‌ని,మంత్రి కొడుకు అధికారిక కార్య‌క్ర‌మాలు అయిన గృహాల‌ను ప్రారంభిస్తున్న‌ర‌ని,దినిపై ప్రోటోకాల్ ఉల్ల‌ఘ‌నపై ఉత్త‌ర్వుల‌ను ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరినప్ప‌టికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు.త‌న‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ట్ల వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి ఆంశాలు లేవ‌ని,విధ‌న‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను విభేదిస్తున్న‌మ‌న్నారు.తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌ట్టుబ‌డి వున్న‌న‌ని,ఉద్యోగ సంఘ‌లకు త‌న వ‌ద్ద ఉన్న ఆధార‌లు ఇచ్చేందుకు సిద్దంగా వున్న‌ని చెప్పారు.ఈ విష‌యంపై క‌లెక్ట‌ర్‌ను నిల‌దీసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్దంగా వుంటే ప్ర‌జాప్రతినిధిగా తాను ఎక్కడికి ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తాన‌న్నారు.జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు ఉద్యోగ సంఘ‌లు,ఉద్యోగులు ప‌నిచేయాల‌ని హిత‌వు ప‌లికారు.ఈ స‌మావేశంలో ఎమ్పీటిసి వెంక‌ట‌శేష‌య్య‌త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY