అవినితి పాల‌న త్వ‌ర‌లో అంతం-కాకాణి

0
19

వంచ‌న‌పై గ‌ర్జ‌న ధ‌ర్నా
నెల్లూరుః చంద్ర‌బాబు అవినితి పాల‌నతో ప్ర‌జలు విసిగిపోయార‌ని,రాష్ట్ర అభివృద్దితో పాటు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరాలంటే వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సి.ఎం కావాల‌ని వైసిపి జిల్లా అధ్య‌క్ష‌డు కాకాని.గోవ‌ర్ద‌న్‌రెడ్డి అన్నారు.గురువారం వై.ఎస్‌.జ‌గ‌న్ 2వేల కి.మీ పాద‌యాత్ర పూర్తిచేసిన సంద‌ర్బంలో జిల్లా వ్యాప్తంగా చేప‌ట్టిన వంచ‌న‌పై గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ట్ట‌ణంలో స్దానిక గాంధీ బొమ్మ వ‌ద్ద నుండి మోట‌ర్‌బైక్‌ ర్యాలీ నిర్వ‌హించి,జిల్లా క‌లెక్ట‌ర్ కార్య‌ల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ పాద‌యాత్రంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ స‌మ‌స్య‌లు తెలుసుకుంటు,విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటు ముందుకు సాగుతున్న‌ర‌న్నారు.ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు వైసిపి పోరాటం సాగిస్తుంద‌ని తిరుప‌తి ఎం.పి వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు.అనంత‌రం ఎం.పి మేక‌పాటి.రాజమోహ‌న్‌రెడ్డి,సిటి ఎమ్మేల్యీ అనిల్‌కుమార్‌,రూర‌ల్ ఎమ్మేల్యే శ్రీధ‌ర్‌రెడ్డి,కావ‌లి ఎమ్మేల్యే రామిరెడ్డి.ప్ర‌తాప్‌రెడ్డి.ఆత్మ‌కూరు ఎమ్మేల్యే మేక‌పాటి.గౌత‌మ్‌రెడ్డి,కోవూరు పార్టీ ఇన్‌చార్జీ న‌ల్ల‌పురెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి, జ‌డ్పీ ఛైర్మ‌న్ బొమ్మిరెడ్డి.రాఘ‌వేంద్రరెడ్డిలు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో విన‌తి ప‌త్రం ఇచ్చారు.

LEAVE A REPLY