అధికార పార్టీ నాయకులు చెప్పిందల్లా చేసి ఇబ్బందులు పడవద్దు-కాకాణి

0
99

నెల్లూరుః కలెక్టర్‌ పట్ల గౌరవ భావంతో వ్యవహరించామే తప్ప,అనవసర ఆరోపణలు చేయలేదని,అధికారులను కోరుకునేది,దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించండి తప్ప,అధికార పార్టీ నాయకులు చెప్పిందల్లా చేసి ఇబ్బందులు పడవద్దని స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి ప‌రోక్ష వ్యాఖ్య‌నాలు చేశారు.శుక్ర‌వారం మనుబోలు మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో అయ‌న మాట్లాడుతూఅధికారులు కొంతమంది సామూహిక సెలవు పెట్టి ఉండవచ్చు, కొందరు విధులకు హాజరయి ఉండవచ్చు. అందరికీ అండగా నిలుస్తాం తప్ప,మరొక విధంగా ఆలోచించని,అధికారులు వత్తిడికి గురి కావలసిన అవసరం లేదని,ఉద్యోగులందరికీ తాను ఎప్పటికీ అండగా ఉంటాన‌ని తెలిపారు.ఉద్యోగులందరు స్వేచ్ఛగా,స్వతంత్రంగా మీ పరిధిలో రాజకీయాలు,పార్టీల జోలికి వెళ్లకుండా విధులు నిర్వహించాల‌ని కోరారు.సోమిరెడ్డి తన అవినీతిని,అసలు విషయాలను పక్క దారి పట్టిస్తున్నాడని,సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ కని,విని ఎరగని రీతిలో మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడి మాటలకు, బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదని,
జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసినా,ప్రస్తుతం శాసన సభ్యుడిగా పనిచేస్తున్నా,ఉద్యోగులకు వీలైనంత సహకరిస్తానే తప్ప,ఏనాడూ ఇబ్బంది పెట్టే నైజం త‌నది కాదన్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రతిపక్ష శాసన సభ్యుడిపైన,జన్మభూమి,నవనిర్మాణ దీక్షలు లాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విమర్శలకు ఉసిగొల్పడం సిగ్గుచేట‌న్నారు.

LEAVE A REPLY