న‌గ‌రంలో య‌ధేచ్చ‌గా పందులు-ప్ర‌జ‌ల‌కు పొంచివున్న ముప్పు-అనిల్‌కుమార్‌

0
84

నెల్లూరుః న‌గ‌రంలో దాదాపు 20వేల పందులు ఉన్న‌యని,క‌మిష‌న‌ర్‌గా చ‌క్ర‌ధ‌ర్‌బాబు ఉన్న రోజుల్లో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా వాటిపై ఆధ్య‌య‌నం చేసి పందుల యజ‌మానుల‌క న‌గ‌ర శివార్ల‌లో స్ద‌లం మంజూరు చేయించి ఇళ్ల స్దలాలు కేటాయించి పందుల‌ను మేపుకునే విధంగా ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయని వైసిపి సిటి ఎమ్మేల్యే అనిల్‌కుమార్ తెలిపారు.సోమ‌వారం అయ‌న 13వ డివిజ‌న్ ప‌రిధిలోని బాలాజీన‌గ‌ర్‌,గౌడ హాస్ట‌ల్‌,ల‌క్ష్మీన‌గ‌ర్‌లో ప్రాంతాల్లో అయ‌న ప‌ర్యాటించి ప్ర‌జల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్న అనంత‌రం అయ‌న మాట్లాడుతూ న‌గరంలో ఒక ప‌క్క పందులు తిరుగుతుంటే,మంత్రి నారాయ‌ణ స్వ‌చ్చ‌భార‌త్‌,స్వ‌చ్చ నెల్లూరు అని చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌న్నారు.న‌గ‌రంలో ఇటీవ‌ల ఒక ప్ర‌దేశంలో దాదాపు 50 పందులు చ‌చ్చిపోయి కుళ్ళిపోయి ఉన్నయ‌ని,ఇలాంటి సంఘ‌ట‌న‌ల వ‌ల‌న ప్ర‌జ‌ల‌కు అంటు వ్యాధులు సోకే ప్ర‌మాదం వుంద‌న్నారు.కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు వారి ప‌బ్బం గ‌డ‌పుకునేందుకు,పందుల‌ను మేపుకుని వారిని అడ్డంపెట్టుకుని దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌ప‌డ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. ప‌ట్ట‌ణ పౌరుల‌కు ఇబ్బందులు లేకుండా,పందులు య‌జ‌మాను న‌గ‌ర శివార్ల‌లో పందులు మేపుకుని విధంగా చ‌ర్య‌లు తీసుకొవాల‌ని కోరారు.మార్చి 26వ తేదిన ఫించ‌న్ల కోసం ఆర్హులైన వారితో కార్పొరేష‌న్ ముందు ధ‌ర్నా చేయ‌నున్న‌ట్లు చెప్ప‌మ‌ని,అయితే నేడు సెల‌వు కావ‌డంతో ఆ కార్య‌క్ర‌మంను వాయిదా వేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో నాయ‌కులు ప్ర‌తాప్‌రెడ్డి,ల‌క్ష్మీరెడ్డి,ద‌శ‌ర‌ధ‌రామిరెడ్డి,కొండారెడ్డి,వెంక‌టేశ్వ‌ర్లు,వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY