చంద్ర‌బాబును జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు నిద్ర పోరూ-అనిల్‌కుమార్‌

0
57

విశాఖపట్నంః వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే ఐదు కోట్ల మంది గుండె చప్పుడని,ప్రత్యేక హోదాపై వైఎస్‌ జ‌గ‌న్‌ దీక్షాదక్షత చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భయం పట్టుకుందని YSRCP నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఎద్దేవా చేశారు.సోమ‌వారం విశాఖలో వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లీంచేందుకు సీఎం దొంగ నాటకాలు,దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.తాను చేసిన అవినీతికి కృష్ణా జన్మస్థానానికి వెళ్తాననే భయం చంద్రబాబుకు ప‌ట్టుకుంద‌ని,అందుకే అందరూ తనకు కాపలా ఉండాలని ప్రజలను అడుగుతున్న‌ర‌ని,అవినితి ప‌నులు చేస్తే ఇలాంటి ప‌రిస్దితి వ‌స్తుంద‌ని తెలియ‌దాఅంటు ప్ర‌శ్నించారు.నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అందరికి తెలిసిపోయిందని, జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు ఎవరూ నిద్ర కూడా పోరని వ్యాఖ్యానించారు.నాడు కాంగ్రెస్‌తో కుట్రపన్ని వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారన్నారు.అవినీతిలో కూరుకుపోయిన బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు.

LEAVE A REPLY