1000 కి.మీ మైలురాయిని చేరుకున్న పాద‌యాత్ర‌-అనిల్‌

0
84

నెల్లూరుః జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర సోమవారంతో 1000 కి.మీ మైలురాయిని చేరుకున్న సంద‌ర్బంగా వాక్‌విత్ జ‌గ‌న్ కార్యాక్ర‌మానికి మ‌ద్దతుగా నెల్లూరు న‌గ‌రంలో బైక్ ర్యాలీ చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని వైసిపి సిటీ ఎమ్మేల్యే అనిల్‌కుమార్ చెప్పారు.సోమ‌వారం నాయ‌కులు,కార్య‌కర్త‌ల‌తో క‌ల‌సి న‌గ‌రంలోని రాజ‌న్న భ‌వ‌న్ నుండి ఆత్మ‌కూరుబ‌స్టాండ్‌, న‌ర్త‌కిసెంట‌ర్‌, చిన్న‌బ‌జారు, వీఅర్సీ,గాంధీబొమ్మ‌, రామ‌లింగాపురం,విజ‌య‌మ‌హాల్‌గేటు మీదుగా బైక్‌ర్యాలీని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌కు తెలుగురాష్ట్రల్లోనే కాకుండ‌,ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారు ర్యాలీలు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో డిప్యూటివ్ మేయ‌ర్ ముక్కాల‌.ద్వార‌క‌నాథ్‌,రూప్‌కుమార్‌,ర‌విచంద్ర‌,ఖ‌లీల్ ఆహ్మ‌ద్‌,నాగ‌రాజు,నాయ‌కులు వెంక‌టేశ్వ‌ర్లు త‌ద‌తరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY