రాష్ట్రపాలనకు చంద్రగ్రహణం పట్టింది-జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

0
72

అంద‌రికి ఇళ్లు పేరుతో దొపిడి..
నెల్లూరుః అధికారంలో ఉన్న నాయ‌కులు పైనుంచి కింది వరకు పని చేయాలంటే నాకు ఎంత ఇస్తావు అంటు ప్ర‌జ‌ల‌ను దొచుకుతింటున్న‌ర‌ని వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌పార్టీ అధినేత‌ జగన్‌మోహన్‌రెడ్డి మండి పడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం గుడూరు కోర్టు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపాలనకు చంద్రగ్రహణం పట్టిందని, ఆ విష‌యం గుడూరు ప్రాంతంలోని పరిస్థితులను చూస్తే స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టారు. ఇలాంటి పాలన అంత‌మొందించి,రాజకీయాల్లో విశ్వసనీయతను తీసుకురావడానికి తనకు తోడుగా ఉండి, ఆశీర్వదించాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గూడూరు నియోజకవర్గంలో నిమ్మపంట అధికంగా వేస్తారని, దాదాపు 40 వేల ఎకరాల్లో నిమ్మపంట వేస్తున్న రైతుల బాధలు వర్ణనాతీతంమ‌న్నారు. 80 కేజీల నిమ్మకాయలు 500లకు కొనుగోలు చేస్తున్నారని,తాము ఎలా బ్రతకాలని రైతులు ప్ర‌శ్నిస్తున్న‌ర‌ని, సరుగుడు పంట రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని రైతులు తెలుపుతుంటే హృదయం క‌రిగిపోతుంద‌న్నారు.పంట పండించేందుకు, అమ్ముకునేందుకు రైతులు రోడ్ల‌పై ప‌డాల్సివ‌స్తుంద‌న్నారు.
అంద‌రికి ఇళ్లు పేరుతో దొపిడిః-గూడురు పక్కనే ఉన్న బుర్రిపాలెం పక్కన పేదలకు మూడు వందల అడుగుల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఊదరగొట్టారని, ఫ్లాట్‌కు అడుగుకు రూ. 850 నుంచి 900 వరకూ మాత్రమే ఖర్చు అవుతుందన్నారు.అయితే అడుగుకు రూ. 2 వేలు వంతున వ‌సూలు చేస్తున్న‌ర‌ని ఆరోపించారు.ప్లాట్‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తం 6 లక్షల్లో ఒకటిన్నర లక్ష కేంద్ర ప్రభుత్వం, ఒకటిన్నర లక్ష రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగత మొత్తం 20 ఏళ్ల పాటు నెలకూ రూ. 3వేల చొప్పున పేదవాడు చెల్లించుకొవాల‌ని ఇదేక్క‌డ న్యాయ‌మ‌న్నారు.రాష్ట్రనికి చంద్ర‌గ్ర‌హ‌ణంమంటే ఇదేన‌న్నారు.నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నజగన్ మోహన్ రెడ్డి చిన్నారులకు పోలియో మందు వేశారు. పసిపిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో మందు వేయించాలని ఆయన సూచించారు.

 

LEAVE A REPLY