రాష్ట్రన్ని అభివృద్ది చేస్తాడ‌ని బాబును గెలిపిస్తే జనం గుండెల్లో గునపాలు-జ‌గ‌న్‌

0
102

ప‌శ్చిమ‌గోదావరిః ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు 30 కోట్లు ఖర్చుపెట్టి బాబు ఒక్క​పూట నిరాహార దీక్ష చేశాడని, బాబాలా ఆయన వేదికపై కూర్చుంటే అందరూ వెళ్లి కాళ్లు మొక్కాలని, పద్మభూషణ్,ఆస్కార్ అవార్డులు ఇచ్చేవాళ్లు గనుక చంద్రబాబును చూసుంటే ఆయనకే ఉత్తమ విలన్ అవార్డు ఇచ్చేవారని వై.ఎస్‌.ఆర్.సి.పి అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు.సోమ‌వారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో161వ రోజు ఏలూరులో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా అయ‌న ప్ర‌జ‌ల‌నుద్దేశించి మ‌ట్లాడుతూ పదేళ్లు కాదు 15ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికలకు ముందు మాట్లాడిన చంద్రబాబుకు,ఎన్నిక‌ల్లో గెలిచిన తర్వాత ఆ విషయం గుర్తుకురాలేదని,నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని,హోదా విషయంలో చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయన్నారు.రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ మీడియాను మేనేజ్‌ చేస్తూ నాలుగేళ్లుగా పాలనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను దారుణంగా వంచించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందునా.. మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? రాష్ట్రన్ని అభివృద్ది చేస్తాడ‌ని అయ‌న ప్ర‌జ‌లు గెలిపిస్తే, చంద్రబాబు మాత్రం జనం గుండెల్లో గునపాలు దింపారు. నాలుగేళ్లుగా ఇసుక నుంచి బొగ్గు దాకా, గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా అన్నింటిని మింగేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు ఈ జిల్లా నుంచే టీడీపీ బీజం వేసింది. ఇసుక అక్రమాలను ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడిచేశాడు. ఈ జిల్లా నుంచే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు.అని జగన్ ఆరోపించారు.

LEAVE A REPLY