జె.పి న‌డ్డాకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ‌

0
150

ఫాతిమా కాలేజ్ విద్యార్దుల‌కు న్యాయం.
అమ‌రావ‌తిః క‌డ‌ప జిల్లాలోని ఫాతిమా మెడిక‌ల్ కాలేజ్ విద్యార్దుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో వుంచుకుని,మాన‌వ‌త దృక్ప‌ధంతో వారికి న్యాయం చేయాల్సిందిగా వైఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్ష‌డు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి నడ్డాకు లేఖ రాశారు.2015-16 సంవ‌త్స‌రంలో ఎన్‌.టి.ఆర్ హెల్త్ యూనివ‌ర్సీటి మొద‌ట‌,రెండ‌వ విడ‌త కౌన్సిలింగ్‌కు అనుమ‌తి రాలేదు.అయితే 3వ విడ‌త కౌన్సిలింగ్ హైకోర్ట మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ద్వారా ఫాతిమాకాలేజ్ చేరి దాదాపు 100 మంది విద్యార్దులను చేర్చుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.అయితే త‌ద‌నంత‌రం ఎం.సి.ఏ విద్యార్దుల అడ్మిష‌న్‌లు చెల్ల‌వంటు ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని,దినిఐ సంబంధిత యాజ‌మాన్యం సుప్రీమ్‌కోర్టుకు వెళ్ల‌డం,అక్టోబ‌రు 27,2017లో సుప్రీమ్ కోర్టు పిటీష‌న్ డిస్మ‌స్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.అయితే విద్యార్దుల విలువై భ‌విష్య‌త్‌ను,వారి త‌ల్లితండ్రుల మ‌నోవేధ‌న‌ను దృష్టిలో వుంచుకుని,100 మంది విద్యార్దుల‌ను ఇత‌ర కాలేజ్‌లో స‌ర్దుబాటు చేసే విధంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకొవాల‌ని విజ్ఞాప్తి చేస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY