భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నజ‌గ‌న్‌

0
67

జ‌గ‌న్ వెంట న‌డుస్తున్న ఎమ్మేల్యే అనిల్‌కుమార్‌

క‌డ‌పః ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జ‌గ‌న్‌ వివిధ వర్గాల వారికి, ప్రభుత్వ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.నెల్లూరు సిటీ వైసిపి ఎమ్మేల్యే అనిల్‌కుమార్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో కల‌సి పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు.ఈ యాత్ర‌లో భాగంగా ఫిజియోథెరపీ వైద్యులు, 108 ఉద్యోగులు, రాష్ట్రీయ బాల స్వస్త్య ఉద్యోగులు, ఆర్‌టీపీపీ, డిస్కం, జెన్‌కోలో 20 నుంచి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు, వీఆర్‌ఏలు, వివిధ కుల సంఘాల నాయకులు జగన్‌కు కలసి వారి సమస్యలు వివరించారు. వైఎస్ఆర్‌సిపి అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నారు.
14 రేపటి నుంచి కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రః-
వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 14 నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రి కర్నూలు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతమైన చాగ‌ల‌మ‌ర్రి శివారులోని ఎస్‌ఎస్‌ డాబా వద్దకు ప్రజా సంకల్ప పాదయాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం 8.30 గంటల నుంచి పాదయాత్ర చాగలమర్రి మండలంలో ప్రారంభమవుతుందని, ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ ఖరారు అయినట్లు స్పష్టం చేశారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

LEAVE A REPLY