ప‌చ్చా చొక్కావారికే కాకుండా పేద‌వారికి రుణాలు మంజూరుచేయాలి-ముక్కాల‌

0
89

నెల్లూరుః కార్ప‌రేష‌న్‌లో ఈనెల 2 నుండి 5వ తేది వ‌ర‌కు నిర్వ‌హించిన రుణామేళాలో అన్ని వ‌ర్గాల‌కు చెందిన దాదాపు 20 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ర‌ని,రుణ‌మేళాలో పాల్గొన్న ఆర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వం నుండి వ‌చ్చే రుణాలు కార్పొరేష‌న్ ద్వారా అందించాల‌ని డిప్యూటివ్ మేయ‌ర్ ముక్కాల‌.ద్వార‌క‌నాధ్ కోరారు.శుక్ర‌వారం కార్పొరేష‌న్‌లోని అయ‌న ఛాంబ‌ర్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ గ్రూపు లోన్‌ల‌కు 20 వేలు స‌బ్సిడీ రుణాల‌కై 20 వేలు మొత్తం 40 వేలు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని,వీరింద‌రిలో ప‌చ్చా చొక్కావారికి పెద్ద పీట వేయ‌కుండా,ఆర్హులైన వారంద‌రికీ రుణాలు మంజూరు చేసి,వారి జీవ‌న అభివృద్దికి తోడ్పాడ‌ల‌ని సూచించారు.రుణాలు కోసం వేల మంది ద‌ర‌ఖాస్తులు చేసుకుంటే 2200 మందికి మాత్ర‌మే రుణాలు మంజూరుఅయ్యాయ‌ని కార్పొరేష‌న్ వైకాపా ఫ్లోర్‌లీడ‌ర్ రూప్‌కుమార్ తెలిపారు.నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్ద ప‌రిధిలో 40 వేల గృహాలు మంజూరు చేశామ‌ని మంత్రి తెలిపారని,అయితే జ‌నార్ద‌న్‌రెడ్డి కాలనీలో కేవ‌లం 4800 గృహాలు మాత్ర‌మే నిర్మించార‌న్నారు.2022 నాటికి గూడూ లేని వారు ఉండ‌కూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి మాట్ల‌డ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు.ఈసమావేశంలో శ్రీనివాస్‌,ర‌విచంద్ర‌,నాగ‌రాజు,ఖ‌లీల్‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY