ఎన్నిక‌ల్లో పోటీ అంటే స్మగ్లర్లను ఎదురుకోవాల్సిన పరిస్థితి-ఆనం

0
78

నెల్లూరుః వెంక‌ట‌గిరి నియోజకవర్గంలో పోటీ అంటే స్మగ్లర్లను ఎదురుకోవాల్సిన పరిస్థితి ఉందని,స్మగ్లర్లను మనోధైర్యంతో,గుండె నిబ్బరంతో ఎదురుకొందమ‌ని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.శుక్ర‌వారం వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి తొలిసారి పెనుశిల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నేతలు,కార్యకర్తలతో సమావేశం నిర్వ‌హించిన అనంత‌రం అయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇటలీ దెయ్యం అని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు సోనియాతో చేతులు కలపటం దారుణమ‌ని, నాడు సోనియా దెయ్యం ఐతే నేడు చంద్రబాబు రాష్ట్రం పాలిట నరకాసురిడిగా మారాడని విమ‌ర్శించారు.ఎన్డిఏని వీడిన చంద్రబాబు యూపీఏ పంచన చేరాడని,తనని తాను కాపాడుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ళ దగ్గరకు చేరాడం ఎన్టీఆర్ఆత్మ‌ క్షోభిస్తుం ద‌న్నారు.ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో నారాసుర టీడీపీ కొనసాగుతోందని,జగన్ సీఎం ఐతేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంద‌న్నారు.2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతీకార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లాపార్టీ అధ్యక్షులు కాకాణి.గోవర్ధన్ రెడ్డి ,మాజీ ఎంపీ వరప్రసాద్ ,ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY