చేసే ప‌నులే చెబుతాను-వైఎస్‌.జ‌గ‌న్‌

0
125

క‌మ‌లాపురంః భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టానని వైఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్ప‌టికి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.మూడురోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గ వీఎన్‌పల్లికి చేరుకున్నసంద‌ర్బంలో అయ‌న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలనే సిద్ధాంతాలు రాజకీయ వ్యవస్థలో కనుమరుగైన పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే చైతన్యం ప్రజల దగ్గర నుంచి రావాలని, రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా ప‌ని చేస్తానని మాట చెప్పి, ఆ వాగ్ధానాన్ని స‌ద‌రు రాజకీయ నాయకుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకునే పరిస్థితి రావ‌ల‌ని, అప్పుడే రాజకీయాల‌కు విశ్వసనీయత ఉంటుందన్నారు.ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఉండాలని నవరత్నాలను ప్రకటించమ‌ని, ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా నవరత్నాల్లో కూడా మార్పులు చేస్తామ‌న్నారు.చంద్రబాబు లాగ‌ మోసాలు ఉండవని,వాళ్ల పార్టీ మ్యానిఫెస్టో ఇంట‌ర్ నెట్‌లో కనిపించదని,ఒక వేళ‌ కనిపిస్తే చంద్రబాబును కొడతారనే భయమ‌న్నారు. ఎందుకు కొడతారంటే.బాబు చెప్పిందొకటి, చేసేదొ ఒకటి,కాబట్టన్నారు. వైఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టోనే వారి ముందు వుంచుతుంద‌ని,కేవలం 2, 3 పేజీలు మాత్రమే ఉంటుందని మ్యానిఫెస్టోలో చేసేది పెడతమ‌ని,అలాగే ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన‌వి, చెప్పినవే కాదు. చెప్పనివి కూడా చేస్తామ‌న్నారు. అటు త‌రువాత‌ 2024 ఎన్నికల్లో చెప్పిన ప్రతి అంశం చేశాం కాబ‌ట్టి, ఆశీర్వదించండి అని అడుగుతామ‌న్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు ముందడుగు పడాలంటే ప్రజల నుంచి చైతన్యం రావాలని, ప్ర‌జ‌లంత అండ‌గా నిల‌బ‌డల‌ని కోరుతున్న‌మ‌న్నాడు.

LEAVE A REPLY