బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాట‌ల యుద్దం

0
157

అమరావతిః పోలవరం స‌మ‌స్య‌ బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాట‌ల యుద్దంకు తెర‌లేచింది. రెండు పార్టీల అగ్ర‌నేత‌లు సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్దాయి నాయకులు మాత్రం ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, కేంద్రంతో అవసరమని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు.ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు మాత్రం టీడీపీపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు వారించినా టిడిపి పార్టీ నేతలు కూడా బిజెపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి వైసీపీ నేతలు కూడా అండగా నిలబడుతున్నారు. బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీపై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే బీజేపీ నేతలను, టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు.బీజేపీపై బురదచల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని హితవు పలికారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని, అది దైవమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దీని కేంద్రమే నిర్మిస్తుందన్నారు.

LEAVE A REPLY