రూ.2 వేల నోట్లు కనుమరుగు కానున్నాయా ?

అమరావతి: బ్యాంకింగ్ వ్యవస్థ నుండి క్రమేపీ పెద్ద నోట్లను నిలిపివేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిదా అంటే అవునే అనే పరిస్థితిలు కన్పిస్తున్నాయి.? గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నగద కొరత తీర్చేందుకు వెంటనే రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు.ఇప్పుడు మార్కెట్ లో  తాజా పరిస్థితులు చూస్తే మాత్రం రూ.2 వేల నోటు కూడా క్రమేపీ కనుమరుగు కానున్నది.ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వస్తుండగా, ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.2 వేల నోటును నిలిపివేసింది.ఇక, SBI ATMల నుంచి రూ.2 వేల నోటు రాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) సూచనల మేరకు SBI ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే దాదాపు అన్ని SBI ATMల్లో రూ.2 వేల నోట్లను ఉంచే ర్యాక్ ను తొలగించినట్టు సమాచారం.. త్వరలోనే రూ.500 నోటును కూడా ATMల్లో నిలిపే వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేవలం రూ.200, రూ.100.రూ.50 నోట్లు మాత్రమే ఇక SBI ATMల ద్వారా డ్రా చేసుకునే సదుపాయం వుంటుంది.? మరోవైపు ATMల్లో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండడంతో ATMల్లో Free లావాదేవీల పరిమితిని పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్టు సమాచారం ?

LEAVE A REPLY