క‌ర్ణాట‌క‌లో మ‌ళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి ?

0
128

అమ‌రావ‌తిః కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీ-ఫోర్ సర్వే తేల్చేసింది. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు వశం చేసుకుంటుందని సోమవారం సీ-ఫోర్ సర్వే విడుదల చెయ్యడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.సర్వే విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ, అమిత్ షాల పాచికపారదని సర్వే అంటోంది.2018 మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీ-ఫోర్ సర్వే నిర్వహించింది.154 శాసన సభ నియోజక వర్గాల్లో 22,357 మంది ఓటర్లను కలిశారు.2,368 పోలింగ్ కేంద్రాల్లో సర్వే నిర్వహించి సర్వేని విడుదల చేశామని సీ-ఫోర్ సర్వే తెలిపింది.326 నగరాలు, పట్టణాలు, 977 గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించామని,ఒక్క శాతం సర్వే అంచనాలు తప్పు అయ్యే అవకాశం ఉంటుందని సీ-ఫోర్ సర్వే వివరించింది.ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లు సంపాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు సొంతం చేసుకుంది.2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకుని 46 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని, బీజేపీ 31 శాతం ఓట్లు, జేడీఎస్ 16 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సీ-ఫోర్ సర్వే తెలిపింది.

LEAVE A REPLY