వొడాఫోన్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌ !

0
115

అమ‌రావ‌తిః వాయిస్‌కాల్స్‌,నెట్‌డేటా వినియోగంలో మార్క్‌ట్‌ను జియో ఒక కుదుపు కుదిపేసింది.జియో పోటీని త‌ట్టుకునేందుకు ఇత‌ర ఆపరేట‌ర్స్ వివిద ర‌కాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి,త‌మ క‌స్ట‌మ‌ర్స్‌ను నిల‌బెట్టుకునేందుకు నానా తంటాలు ప‌డ్డాయి,ప‌డుతున్న‌యి. ఈనేప‌థ్యంలో త‌మ వినియోగ‌దారుల‌కు వొడాఫోన్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే త‌మ ప్రీపెయిడ్‌ వినియోగ‌దారులు 90జీబీ 4జీ డేటాను ఆరు నెల‌ల కాల వ్య‌వ‌ధితో పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్‌ లోకల్‌కాల్స్‌, ఎస్టీడీ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.వొడానెట్‌వ‌ర్క్ ఆఫ‌ర్‌ను ప‌రిశీలించి చూస్తే రూ.4.43కే 1జీబీ వ‌స్తున్న‌ట్లు లెక్క అని పేర్కొంది. టెలికాం మార్కెట్లో రిల‌య‌న్స్ జియోకు ధీటుగా బిఎస్ఎన్ఎల్‌,ఎయిర్‌టెల్ ఇచ్చిన ఆఫ‌ర్ల‌తో పాటు వొడాఫోన్ తోడైయింది.అయితే కొత్త‌గా క‌నెక్ష‌న్ తీసుకునేవారికి మాత్ర‌మేనా? లేక పాత క‌స్ట‌మ‌ర్స్‌కూడా వ‌ర్తిస్తుందా లేదా అన్న విష‌యంతో పాటు,వొడాఫోన్‌లో అన్ని స‌ర్కిల్స్‌లో ఈ ఆఫ‌ర్‌లో ఉన్న‌దొ లేదో అన్న స్ప‌ష్ట‌త క‌రువైంది.ఈ ప్లాన్‌లోకి వెళ్లె ముందు ఒక సారి చెక్ చేసుకొవడం మంచిది.?

LEAVE A REPLY