ఆకాల వ‌ర్షంతో 11 మృతి

0
171

అమ‌రావ‌తిః గుంటూరు, కృష్ణా,ప్రకాశం,విశాఖపట్నం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఒక్కసారిగా కురుస్తోన్న అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.కృష్ణా జిల్లాలో సహాయక చర్యల కోసం విజయవాడలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు.పెను గాలుల ధాటికి విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.పిడుగు పాట్లు,చెట్లు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రజలు సురక్షిత మైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతోంది.

LEAVE A REPLY