పిల్లిని హ‌త్యచేశారంటు కేసు న‌మోదు చేసిన విశాఖ పోలీసులు

విశాఖ‌ప‌ట్నంః పెంపుడు జంతువులంటే ప్రాణం ఇచ్చే యాజ‌మానులు,వాటికి ఏదైన ప్ర‌మాదం జ‌రిగితే చాలా త్రీవంగా స్పందిస్తున్నారు.ఈనేప‌థ్యంలో తన పెంపుడు పిల్లిని హత్య చేశారంటూ రైల్వే న్యూ కాలనీలోని రేవతి టవర్స్‌లో నివాసం ఉండే కటారి.యశోద అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు.తమ ఎదురింటివాళ్లు కొట్టిన దెబ్బలకు తన పిల్లి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పిల్లిని చంపినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.య‌శోద‌కు అండగా విశాఖ సొసైటీ ఫర్ ప్రొటక్షన్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ యానిమల్స్‌ సంస్థ రంగ ప్ర‌వేశం చేయ‌డంతో,, విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.అంతేనా పోస్టుమార్టం నిమిత్తం పిల్లి మృతదేహాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.