క్రైస్తవ మతాభిమాని టిటిడి ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారు-విశ్వ‌హిందు ప‌రిష‌త్‌

0
205

అమ‌రావ‌తిః క్రైస్తవ మతాభిమాని అయిన పుట్టా సుధాకర్‌యాదన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారంటు,టిడిపి ప్రభుత్వాన్నితప్పుబడుతూ విశ్వ హిందూ పరిషత్ లేఖాస్త్రం సంధించింది. వీహెచ్‌ప్పీతెలంగాణా విభాగం సంయోజ‌క్ రావినూత‌ల‌.శ‌శిధ‌ర్‌ ఈ లేఖ విడుదల చేశారు.మరోవైపు సోషల్ మీడియాలోనూVHP,BJP,RSS మద్దతుదారులే కాకుండా హిందూ మత అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.అయితే ఇదంతా టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి కావాలని ఆడిస్తున్న నాటకమని తెలుగుదేశం మద్దతుదారులు వ్యాఖ్య‌నిస్తున్నారు.టిటిడి ఛైర్మన్‌గా పుట్టా.సుధాకర్‌యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణా విభాగం సంధించిన లేఖాస్త్రం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఛైర్మన్‌గా పుట్టా.సుధాకర్‌యాదవ్‌ను నియమించనున్నట్లు సుమారు 10 నెలల క్రితమే వార్తలు వెలువడిన వెంట‌నే తొలుత RSS మొదలుకొని వివిధ పీఠాధిపతులు తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతో,,ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది.సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితమని,పలుమార్లు క్రిస్టియన్ సభలకు హాజరు కావ‌డంతో పాటు,స‌ద‌రు సంస్ద‌ల‌కు అన్ని విధాల స‌హాయం అందిస్తాడ‌ని ఆరోపించ‌డం జ‌రిగింది.హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్నవారికే ఈ పదవి కట్టబెట్టాలనేది వీరి అంద‌రి వాదన.క‌డ‌ప జిల్లా వారికే తప్ప రాష్ట్ర వాసులకు అంతగా తెలియని ఈ పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్దిక మంత్రి యనమల,తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఈయన స్వయానా వియ్యంకుడు.రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులుగా వ్యవహరిస్తున్నవారిద్దరి కుమార్తెలకు తన కుమారుల్ని ఇచ్చి పెళ్లి చేసిన సుధాకర్‌యాదవ్ ఆంధ్రా,తెలంగాణలో వేల కోట్ల రూపాయ‌ల కాంట్రాక్ట‌కులు చేస్తు త‌న‌ హవా కొనసాగిస్తున్నారు. ఇద్ద‌రి వియ్యాంకుల అండ‌తో ఎవరెన్ని విమర్శలు చేసినా టిటిడి ఛైర్మన్‌ పదవి ఆయన్నే వరించింది.సుధాకర్ రాజకీయ నిరుద్యోగి అని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టిటిడి బోర్టును వేదికగా చేసుకోవడం క్షమించరాని తప్పిదంగా విహెచ్పి తన లేఖలో పేర్కొంది.పుట్టా నియామకంతో ఇప్పటికే టిటిడిలో తిష్టవేసిన అన్యమత ఉద్యోగులు ఇంకా పెట్రేగిపోతారని,అంతేకాదు పుట్టా నియామకాన్ని వెంటనే విరమించుకోకుంటే కోటానుకోట్ల స్వామి వారి భ‌క్తుల‌ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది.VHP లేఖలో చివరగా తిరుమల తిరుపతి పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ కార్యాచరణ ప్రకటించబోతోందని స్పష్టం చేసింది.

LEAVE A REPLY