వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర చివరి ఘట్టం 

నెల్లూరుజిల్లా : వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ జాతరకు చివరి రోజైన గురువారం పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఆలయం ముందు భక్తుల సందర్శనార్థం అమ్మవారిని నిలుపగా,భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి పుట్టినిల్లు, మెట్టినిల్లులో అలంకరణలు అయిన అనంతరం, ప్రత్యేక పూలరథంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి వెంకటగిరి పట్టణంలోని నడిబొడ్డులో అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు.ఉదయం 5 గంటల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్రిక్కిరిసి పోయారు.అమ్మవారి దర్శనానంతరం మ్రొక్కులు తీర్చుకున్నారు.5 రోజుల అమ్మవారి జాతరలో గురువారం చివరి ఘట్టంకు వేలాది భక్తులు తరలివస్తుండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు.అలాగే భక్తులు సంఖ్య విపరీతంగా ఉన్నందున పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం లేకుండా,ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిసి కెమెరాలతో మరియు ప్రత్యేక బలగాలతో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరాస్తోగీ  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.