క్యానర్స్ వ్యాధిపై ప్రజల్లో ఆవగాహన పెంచేందుకు 5k ర్యాలీ నిర్వహించడం అభినందనీయం-వైస్ ఛాన్సలర్ సుదర్శన్

నెల్లూరు: ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణలు తీస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ఆవగాహన పెంచుకోవడం ద్వారా,వ్యాధిని దూరంగా పెట్టవచ్చన్న ఆవగాహన ప్రజల్లో కల్సించేందుకు కృష్ణచైతన్య విద్యాసంస్ధల ఆధ్వర్యంలో 5k ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని విక్రమ సింహపురి యూనివర్సీటి వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు అన్నారు.మంగళవా ఉదయం నగరంలోని కృష్ణచైతన్య విద్యాసంస్ధల వద్ద నుండి 5k రన్ ను విద్యాసంస్ధల డైరెక్టర్ కృష్ణరెడ్డితో కలసి జెండా ఉపి రన్ ను ప్రారంభించిన సందర్బంలో అయన మాట్లాడుతూ కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, వ్యాధి నివారణ, గుర్తింపును,చికిత్సను ప్రోత్సహించేందుకు  ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారన్నారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడిందని, 2008 లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం,మరణం గణనీయంగా తగ్గించటమే దిని లక్ష్యం అన్నారు.