పట్టు బడిన కరుడు కట్టిన కన్నదొంగలు-1.5 kg gold,3.5 kgల వెండి

నెల్లూరు: ఇళ్లకు కన్నలువేసి అందికాడికి దొచుకొవడం,అపైన జాల్స చేయడం ప్రవృత్తిగా పెట్టుకుని దాదాపు 80 కేసుల్లో ముద్దాయి అయిన పెద్దినేని.తిరుపతిస్వామి (27), (కమ్మ)ప్రకాశం జిల్లా,,,చిన్న.రాజులు (27)(ఎస్టీ) చిత్తూరు జిల్లాలను నగరంలోని నాలుగు కాళ్ల మండపం వద్ద మంగళవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.5 kg gold,3.5 kgల వెండి ఆభరణలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు.మంగళవారం నిర్వహించి మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ జాల్సకు ఆలవాటు పడిన వీరద్దరు రాత్రుళ్ల సమయంలో ఇళ్లకు కన్నలు వేసి దొచుకోవడంలో ఆరితేరారని చెప్పారు.2005 సంవత్సరం నుండి వీరు దొంగతనాలు చేస్తున్నరని,వీరిని అంతర్ జిల్లాల నేరస్తులు ప్రకటించి వున్నరని తెలిపారు.కరుడు కట్టిన అంతర్ జిల్లాల నేరస్తులను అరెస్ట్ చేయడంలో చాక్యచక్యంగా వ్యవహరించిన పోలీసులను అయన అభినందించారు.ఈ దాడుల్లో RURAL DSP రాఘవరెడ్డి ఆధ్వర్యంలో RURAL CI రామక్రిష్ట,,CRIME CI బాజీజాన్ సైదా,వారి సిబ్బంది పాల్గొన్నారు.