విద్యారంగంలో నాణ్యత ప్ర‌మాణ‌లు పెరగాలి-ఉపరాష్ట్రపతి

0
45

చిత్తూరుః విద్యార్దుల‌కు అనుగుణంగా విశ్వవిద్యాలయాల సంఖ్యను పెర‌గ‌డం మంచిదేనని, ఇదేస‌మ‌యంలో అంతేస్థాయిలో విద్యారంగంలో నాణ్యత ప్ర‌మాణ‌లు పెరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.మంగ‌ళ‌వారం చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవంలో వెంకయ్య పాల్గొన్నసంద‌ర్బంలో అయ‌న మాట్ల‌డుతూ దేశవ్యాప్తంగా 65 శాతంమంది 35 ఏళ్లలోపు వారే ఉండటం మన బలమని,ట్రిపుల్‌ ఐటీ ద్వారా విద్యార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. 2015లో కేంద్రమంత్రి హోదాలో ఈ ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు.దేశంలో 900 విశ్వవిద్యాలయాలున్నాయనీ,అదే స్థాయిలో నాణ్యత ప్రమాణాలు కూడా పెరగాలని అన్నారు. దేశంలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రజలకు తాత్కాలిక ఆనందాన్నిచ్చే హామీలు ఇస్తున్నారని,అభివృద్ధికి కావాల్సింది తాత్కాలిక హమీలు కాదని హితవు పలికారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా రాజకీయాలు మారాలని, ప్రజలు స్వయంగా అభివృద్ధి సాధించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

LEAVE A REPLY