రాష్ట్రంలో ప్రాణాధార‌మైన‌ న‌కీలీ మందులు-బి కేర్ పుల్‌

0
170

అమ‌రావ‌తిః ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం అడుతున్న న‌కీలీ మందుల వ్యాపారస్తుల కేంద్రంగా గుంటురు మార‌డం ఆదోళం క‌లిగిస్తున్న విష‌యం,ఇలాంటి వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు కిమ్మ‌నుకుండా వున్న‌రంటే దానికి ఆర్ధం ఏముంటుంది.ఈనేప‌థ్యంలో దాదాపు 17 రకాల నకిలీ మందులు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌లో చలామణిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వాడే మధుమేహం,బీపీ,యాంటీ బయాటిక్‌, కడుపుబ్బరం, ఎముకలకు శక్తినిచ్చేమందుల్లోనే అధికంగా కల్తీ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.సిప్లా,అరిస్టో,ఆల్కెమ్‌,సన్‌ఫార్మా లాంటి ప్రముఖ కంపెనీ లేబుళ్లతోనే ఈ నకిలీలు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు.రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి ఈ మందులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతున్నాయని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు సమాచారం. కొంత కాలం క్రిద‌ట గుంటూరు,విజయవాడ నగరాల్లో ఆల్ట్రాసెట్‌తో సహా ప్రముఖ కంపెనీలకు చెందిన 8 రకాల నకిలీలను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు.ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వీటిని తయారు చేసినట్లు తెలుసుకున్నారు.రూర్కీలోని మూడు ఫ్యాక్టరీల్లో ఈ మందులు తయారై రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల అధికారులు రూర్కీ ఫ్యాక్టరీలపై దాడులు చేసి మూడు ఫ్యాక్టరీలను సీజ్‌ చేశారు.అప్ప‌టికే రూర్కీలో తయారైన నకిలీ మందులు గుంటూరు చేరినట్లు సమాచారం ఉన్నా,,,స్థానిక అధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నర‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.అస‌లు విష‌యం బయటపడితే ప్రభుత్వం, తీవ్రంగా స్పందిస్తున్న‌దని ఆలోచ‌న‌తో రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు ఏమి తెలియ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ర‌ని విశ్వ‌నీయ స‌మాచారం.ఈ విష‌యంపై ఔషధ నియంత్రణ శాఖ జేడీ వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ నకిలీలు ఉన్నట్లు సమాచారం అందిందని,వాటి ఏరివేత ప్రారంభించామని తెలిపారు.

LEAVE A REPLY