దైవచింతన,భక్తులకు సౌకర్యాలు అందించే వారినే కమిటీ సభ్యులు-శ్రీధర్ రెడ్డి

రాజరాజేశ్వరీ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంనెల్లూరు: దేవాలయం కమిటీని ప్రకటించే సమయంలో,కమిటీ సభ్యుల దైవచింతన,భక్తులకు సౌకర్యాలు అందించేందుకు వారు పడే తపనను దృష్టిలో వుంచుకుని సభ్యులను ఎంపిక చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి తెలిపారు.గురువారం నెల్లూరు నగంలోని రాజరాజేశ్వరీ అమ్మవారి దసరానవరాత్రి ఉత్సవా నిర్వహణ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరం సందర్బలో అయన మాట్లాడారు.మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్బంలో ఖర్చేపెట్టే ప్రతి పైసా పారదర్శకంగా,ఆలోచించి మరి ఖర్చు చేయాలని కోరారు.