ఇనుగుంటలో వ్యక్తి దారుణ హాత్య.?

0
150

నెల్లూరుః నెల్లూరు జిల్లా ఓజిలి మండలం,ఇనుగుంట గ్రామంలో గురువారం దీనపాటి క్రిష్ణయ్య అలియాస్ పడమటి క్రిష్ణయ్య (65) అనే వ్యక్తి దారుణ హాత్యకు గురి అయిన్నాడు. అన్నదమ్ముల ఆస్తి విషయంలో,ఉమ్మడి కుటుంబం వేరుపడే విషయంలో కొంత కాలం నుండి క్రిష్ణయ్యకు అతని తమ్ముడు కొడుకు ప్రసాద్‌కు వివాదం నెలకొంది.హతుడు గురువారం ఉదయం తన నిమ్మతోటలో చెట్లకు నీరు కట్టేందుకు వెళ్లడు.ఇదే అదనుగా భావించిన ప్రసాద్ పదునైన కత్తితో నరికి చంపారని,తరువాత తలను మొండెం నుండి వేరుచేసి,ముక్కలు ముక్కలుగా తరిగి తోటలో చల్లి వేశాడని,ఈ విషయం ను చూసిన ఒక వ్యక్తి ఈ దారుణంను గ్రామంలో చెప్పడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.అయితే గ్రామంలో కొందరు వ్యక్తులు విషయంను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుని,మధ్యాహ్నంకే అంత్యక్రియలు పూర్తి చేశారని సమాచారం.హత్య చేసిన వ్యక్తికి మతి స్థిమితంలేదని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స‌మాచారం. హత్య చేసిన ప్రసాద్ నాయుడుపేట మండలం లోని మేనకూరు సెజ్ లో పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY