దేవిప‌ట్నం వ‌ద్ద లాంచీ మునిగి ఘెర ప్ర‌మాదం??

0
117

అమ‌రావ‌తిః తూర్ప‌గోదావ‌రి జిల్లా దేవిప‌ట్నం మండ‌లం మంటూరు వ‌ద్ద 30 మందితో ప్ర‌యాణిస్తున్నలాంచీ తిర‌గ‌బ‌డి ఘోర ప్ర‌మాదం మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మయంలో జ‌రిగింది.స్దానిక కొండ‌మొద‌ల నుండి రాజ‌మ‌హేంద్రంకు లాంచీ వెళ్లుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.లాంచీ యాజ‌మాని ఖాజా దేవిప‌ట్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు.ప్ర‌మాద స‌మ‌యంలో లాంచీలో దాదాపు 30 మంది ప్ర‌యాణిస్తుండ‌గా, ఇందులో పెళ్లి బృందం ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం జ‌రిగిన స్ద‌లం నుండి 5 మంది ఈత కొట్టుకుంటు ఒడ్డ‌కు చేరుకుని స‌మాచారం అందించ‌డంతో స్దానికంగా వున్న గిరిజనులు నాటు ప‌డ‌వ‌ల‌తో బాధితులు ర‌క్షించేందుకు వెళ్లరాని స్దానికులు తెలియ‌చేస్తున్నారు.

LEAVE A REPLY