స‌బ్బంహ‌రి తెలుగుదేశం తీర్దం పుచ్చుకోనున్నారా .?

0
116

విశాఖ‌ప‌ట్నంః టివిలో చ‌ర్చ‌ల్లో అప్పుడ‌ప్ప‌డు పాల్గొని రాజ‌కీయాల ప‌ట్ల ఎంతో నిబ‌ద్ద‌త వున్న‌ట్టు వ్యాఖ్య‌నాలు చేసే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు ప‌రిస్దితులు చూస్తే అర్దంమౌవుతుంది.ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పాల‌న‌ను సబ్బంహరి పలుమార్లు ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం.ప్రస్తుతం ఏ పార్టీలో లేనటువంటి ఈయ‌న లేరు.హ‌రికి టిడిపిలో చేరేందుకు చంద్రబాబు నుండి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు పార్టీ వర్గాల భోగ‌ట్టా. 2019ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కానీ, విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని సబ్బం హరి కోరినట్టు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.? రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సబ్బంహరి మద్దతుగా నిలిచారు.కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో కూడా చేరి విశాఖ ఎంపీగా నామినేషన్ వేసినప్పటికీ… చివరి క్షణంలో మనసు మార్చుకుని టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు టీడీపీ,బీజేపీలు విడిపోవడంతో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం సబ్బంహరి జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తే కీలకపాత్ర పోషించాలని,మళ్లీ రాకీయంగా పట్టు సాధించాలని తన వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.అప్పట్లో టీడీపీ, బీజేపీలు తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి.సమయం చూసి నిర్ణయం తీసుకుంటానంటూ తటస్థంగా ఉన్న ఆయన.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్య‌నిస్తున్నారు. స‌బ్బంహ‌రి టీడీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.?

LEAVE A REPLY