రిమ్స్‌లో ప్లేట్ లెట్ మిషీన్ ప్రారంభించిన మంత్రులు

0
125

ప్రకాశంః పేద ప్రజలు ప్లేట్ లెట్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఖరీదైన ప్లేట్ లెట్ యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని,రిమ్స్ ఆసుపత్రిలో రూ.80 లక్షల వ్యయంతో ప్లేట్ లెట్ యంత్రాన్ని నిర్మించినట్టు మంత్రి శిద్దా.రాఘ‌వ‌రావు తెలిపారు.బుధ‌వారం ప్లేట్‌లెట్స్ యంత్రాని మ‌రో మంత్రి శ్రీనివాస్‌తో క‌ల‌సి ప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ మల్టీ డోనర్ తో పాటు సింగిల్ డోనర్ యంత్రాన్ని రిమ్స్ లో ఏర్పాటు చేసిమ‌ని,సింగిల్ డోనర్ మిషన్ ప్రస్తుతం విశాఖపట్నంలో మాత్రమే ఉందని తెలిపారు.రిమ్స్ లో చదువుతున్న వైద్య విద్యార్ధుల కోసం వసతి గృహం వద్ద ఏర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించారు.ఒంగోల్ రిమ్స్ కళాశాలకు ఎంసీఐ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్,ఎమ్మెల్సీ కరణం బలరామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY