వ్యవసాయ రంగంలో మొదటి ఆరు నెలల్లోనే 25.5 శాతం వృద్ధి రేటు-సోమిరెడ్డి

0
165

బూటకపు ప్రకటనలు తగదని కాకాణికి హితవు
నెల్లూరుః జిల్లాలో ఎక్కువగా పండించే బీపీటీ ధాన్యానికి క్వింటాల్ కి రూ.210 బోనస్ చెల్లించేందుకు ముఖ్య‌మంత్రి చంద్రబాబు అంగీకరించారని,పుట్టి ధాన్యాన్ని రూ.15,335కి కొనుగోలు చేస్తామ‌ని,ఇది చారిత్రాత్మక నిర్ణయంమని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.గురువారం అయ‌న ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 45 వేల టన్నులు కొనుగోలు చేశామ‌న్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జొన్న,మొక్కజొన్న‌కు క్వింటాలకు రూ.200 బోనస్ ఇవ్వ‌నున్న‌మ‌ని, మొక్కజొన్న రాష్ట్రంలో 2.26 లక్షల హెక్టార్లలో పండించ‌గా 18.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వ‌చ్చింద‌ని, జొన్న లక్ష ఎకరాల్లో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు.కేంద్రం మొక్కజొన్న క్వింటాలు కి రూ.1420 జొన్నకి రూ.1700 మద్దతు ధర ప్రకటించిందని అయితే ఎక్కడా కొనుగోలు మాత్రం చేయలేదని చెప్పారు.ప్రతి రైతు వద్ద 100 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామ‌ని, రైతుకి నేరుగా రూ. 200 బోనస్ నగదు రూపంలో చెల్లిస్తామ‌న్నారు. మినుములు,పెసలు,కందులు కూడా కొనుగోలు చేస్తామ‌ని తెలిపారు.తెలుగుగంగ కింద అదనంగా ఒక లక్ష పదివేల ఎకరాల అదనపు ఆయకట్టు తీసుకు వచ్చామ‌ని, తెలుగు గంగకు సంబంధించి రూ.6700 కోట్లు రివైజెడ్ అంచనాలకు ప్రభుత్వ ఆమోదించేలాగా కృషిచేయాడం జ‌రిగింద‌న్నారు.డేగపూడి-బండేపల్లి లింక్ కెనాల్ భూసేకరణకు రూ.10.30 కోట్లు మంజూరు కానున్న‌య‌న్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా మిగులులో ఉన్న పొరుగు రాష్ట్రాల కన్నా చ‌రిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నమ‌ని,వ్యవసాయ రంగంలో మొదటి ఆరు నెలల్లోనే 25.5 శాతం వృద్ధి రేటు సాధించడం జ‌రిగింద‌న్నారు.కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి ఇరిగేష‌న్ శాఖ మంత్రి దేవినేని ప్రారంభించారని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు.సోమిరెడ్డి ప్రత్యేక చొరవతో సాకారమైన ఈ ప్రాజెక్ట్‌ను,, వైఎస్సార్ దయతో వచ్చిందని ఎమ్మెల్యే కాకాణి మాట్ల‌డ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు. బతికున్నప్పుడు చుక్క నీళ్లు ఇవ్వకుండా తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన రాజన్న దయతో ఇప్పుడు నీళ్లు రావడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.మంచి జరిగితే రాజన్న,ఏదైనా సమస్యలు వస్తే చంద్రబాబు కారణమవుతారా అంటు నిల‌దీశారు. ఏదేని లోపాలుంటే ప్రతిపక్షంగా ఎత్తిచూపాలి కానీ రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో అడ్డగోలు ఆరోపణలు సరికాదన్నారు.విమర్శలు చేయండి కానీ బూటకపు ప్రకటనలు తగదని ఎమ్మెల్యే కాకాణికి హితవు ప‌లికారు.

LEAVE A REPLY