సాగునీటి స‌దుపాయ‌ల్లో స‌ర్వేప‌ల్లి ముందు-సోమిరెడ్డి

0
199

నెల్లూరుః సాగునీటి సదుపాయ‌ల్లో స‌ర్వేప‌ల్లి నియోజ‌వ‌ర్గం ముందంజ‌లో వుంద‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.సోమ‌వారం మంత్రి టి.పిగూడూరు మండ‌లం ప‌రిధిలోని పేడూరు పంచాయితీ,కొలిదిబ్బ‌లో ప‌లు అభివృద్ది,సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.టి.పి.గూడూరు,స‌ర్వేప‌ల్లి ప్రాంతాల్లో చెరువుల‌ను సాగునీటీతో నింప‌డం ద్వారా 26 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తున్న‌మ‌న్నారు.కొలిదిబ్బ‌లో 39 మంది మ‌త్స‌కారులు,గిరిజ‌నుల‌కు 39 వ‌ల‌లు,సైకిళ్లు స‌మీకృత గిరిజ‌నాభివృద్ది సంస్ద ద్వారా అంద‌చేశారు.అదే విధంగా 34 మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను అంద‌చేశారు.ఈకార్య‌క్ర‌మంలో మండ‌ల త‌హ‌సిల్దారు పుల్ల‌య్య‌,ఎం.పి.డి.ఓ హేమ‌ల‌త‌,ఐ.సి.డి.ఎస్ క‌మ్యూనిటి పిడి ఆధికారి సునీత త‌దిత‌రులు పాల్గొన్నారు

LEAVE A REPLY