జ‌గ‌న్ బృందం మోదీని అడ్డంపెట్టుకుని రాష్ట్రన్ని నాశనం చేయాల‌ని చూస్తుంది-సోమిరెడ్డి

0
81

అమ‌రావ‌తిః జ‌గ‌న్ బృందం ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల‌క‌మీష‌న్‌ను,మోదీని అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో ప‌రిపాల‌నను నాశ‌నం చేయాల‌నుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని,ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌జాస్వామ్య‌నిని కీడు చేస్తుందంటు ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు.మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మ‌ట్లాడుతూ చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీ బంగారం తరలించిన వ్యవహారంపై ఆనం రామనారాయణరెడ్డికి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆర్థిక శాఖామంత్రిగా పని చేసిన ఆనం, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరడం విడ్డూరమని అన్నారు.ఆనం రామనారాయణరెడ్డి తో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇంతగా దిగజారి మాట్లాడటం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆనం, ఏ పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలే సంధించారు.రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా తెలియని వ్యక్తులు చంద్రబాబును విమర్శిస్తున్నారన మండిప‌డ్డారు. నాలుగు రోజుల్లో వ్య‌వ‌సాయ‌శాఖ‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని,ఏవ‌రైన అడ్డ‌కుంటే సుప్రీమ్ కోర్టుకు వెళ్లాతాన‌ని అన్నారు.ఒక ప‌క్క ఆకాల వ‌ర్షాల వ‌ల్ల ధాన్యం త‌డిచిపోయింద‌ని,మ‌రి కొన్ని చోట్ల ఆర‌టి,మామిడి చెట్లు దెబ్బ‌తిన్న‌య‌ని,ఇలాంటి స‌మ‌యంలో రైతులు ఎన్నిక‌లఅధికారి లేక చీప్ సెక్ర‌ట‌రీకి,,, ఏవ‌రికి చెప్పాకోవాల‌ని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY