ప‌రిటాల‌.రవి ముఖ్య అనుచ‌రుడు చ‌మ‌న్ గుండెపోటుతో మృతి

0
138

అనంతపురంః తెలుగుదేశం పార్టీ మాజీ పరిటాల.రవి ముఖ్య అనుచరుడైన చమన్(58) సోమ‌వారం గుండెపోటుతో మృతి చెందారు.పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల.స్నేహలత వివాహ వేడుక పర్యవేక్షణ కోసం వచ్చిన ఆయన మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో మంత్రి పరిటాల.సునీత వెంటనే చమన్‌ను అనంతపురంలోని స‌వేరా ఆసుపత్రికి తరలించారు.కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న స‌మ‌యంలో గుండెపోటు మ‌రో సారి త్రీవంగా రావ‌డంతో చమన్ మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైకన్నీరుమున్నీరుయ్యారు. పరిటాల.రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు.2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు.2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు.2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం,పరిటాల సునీత మంత్రి కావడంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర ఛైర్మ‌న్‌గా పనిచేసిన‌ తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.చ‌మ‌న్ మ‌ర‌ణం ప‌రిటాల‌.సునీత కుటుంబానికి తీరని లోటుగా భావించ‌వ‌చ్చు.

LEAVE A REPLY