టీడీపీ నేత చింతమనేనికి ఒక న్యాయం?శ్రీధర్ రెడ్డికి మరో న్యాయమా?-వర్ల

అమరావతి: మహిళా ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.మహిళా అధికారిణిని,, వైసీపీ ఎమ్మెల్యే హింసిస్తుంటే… రాష్ట్ర అధికారులు, ఎంపీడీవో సంఘాలు ఏమి చేస్తున్నాయని అంటు టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో గగ్గోలు పెట్టిన సంఘాలు,,, శ్రీధర్ రెడ్డికి భయపడ్డాయా? అని ప్రశ్నించారు.పోలీస్ స్టేషన్ ఎదుట దీనంగా కూర్చున్న ఎంపీడీవో సరళను మానసిక క్షోభకు గురి చేసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రిగారూ శ్రీధర్ రెడ్డి దౌర్జన్యాలు తమరి దృష్టికి ఎందుకు రావడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.మీ సమాచార వ్యవస్థ అంత బలహీనంగా ఉందా?,,  టీడీపీ నేత చింతమనేనికి ఒక న్యాయం… మీకు అస్మదీయుడైన శ్రీధర్ రెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.