సూట్ కేసు కంపెనీలు మీ జగన్మోహన్‌రెడ్డివి-నూడా ఛైర్మ‌న్‌

0
136

నెల్లూరుః ఆవు మేసిన చోట దూడ మేస్తుందనే తరహాలో జగన్ బాటలో నడుస్తూ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నకాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి,సూట్ కేసు కంపెనీలు మీ జగన్మోహన్‌రెడ్డి అనే విషయం మరిచిపోయినట్టున్న‌వు అంటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విరుచుకు ప‌డ్డారు.మంగ‌ళ‌వారం టీడీపీ జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మ‌వేశంలో అయ‌న స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి బాషా ప‌ట్ల తీవ్రంగ స్పందిస్తు సీనియర్ రాజకీయ వేత్త, జిల్లాకు ఎంతగానో సేవ చేసిన సోమిరెడ్డిని పిచ్చికుంక,బాడ్కో అనే మాటలు మాట్లాడటం దురదృష్టకరమ‌ని,చివరకు తండ్రికి అండగా ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న రాజగోపాల్ రెడ్డిని చూసి నీకెందుకు అంత ఈర్ష్య ? తమరికి కొడుకులు లేరని,ఎదుటి వారి బిడ్డ ఎదిగిపోతున్నాడని అంత బాధ ఎందుకు అంటు నిల‌దీశారు.పొదలకూరుకు పెత్తందారులగా చెప్పుకున్న మీకు దశాబ్దాలుగా సోమశిల దక్షిణ కాలువ కనిపించలేదా ? దొడ్డి దారిన జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు,,మూడు సార్లు మంత్రి అయిన సోమిరెడ్డిని విమర్శిస్తావా ? నీ భాషే నీ కొంపముంచబోతోంది..సోమిరెడ్డి చేసిన అభివృద్ధే సర్వేపల్లిలో టీడీపీని గెలిపిస్తోందని,నీ బాడ్కో అనే పదంతోనే నీకు ఓటమి ప్రారంభమైందన్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు.ఆనం కుటుంబంతో దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నా ఎన్నడూ భాష విషయంలో సోమిరెడ్డి గీత దాటలేదు..నోరు అదుపుతప్ప లేదన్నారు.ప్రతి దానికి కోర్టు కేసులతో అడ్డుపడుతున్నారని,జెడ్పీ చైర్మన్ గా,ఎమ్మెల్యేగా పొదలకూరు మండలానికి ఏం చేశారన్నారు.సోమిరెడ్డి రూ.62 కోట్లతో కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతల పథకం రైతులకు అందుబాటులోకి తేవడంతో పాటు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సోమశిల దక్షిణ కాలువను పూర్తి చేయిస్తూ వేలాది ఎకరాలకు నీటి వసతి కల్పిస్తున్నారని,సోమిరెడ్డి చేసిన పనులతో మీ పొదలకూరు మండలంలో నీటి వసతులు మెరుగుపడ్డాయా లేదా అంటు నిల‌దీశారు.

LEAVE A REPLY