దొంగ స్వామివా లేక భాగ‌స్వామివా-జెసి దివాక‌ర్‌రెడ్డి

0
105

అమ‌రావ‌తిః వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మీడియాకి ఎక్క‌డం అల‌వాటుగా మారిన టీడీపీ ఎంపీ జెసి దివాక‌ర్‌రెడ్డి ఏడుకొండ‌ల‌వాడి నగలపై ఆరోపణలు గుప్పిస్తున్న మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాన అర్చకుడిగా ఉన్నసమయంలోరమణ.దీక్షితులు ఆరోపణలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని,ఇప్పుడు ఏదో ఆన్యాయం జ‌రిగిపొతుంద‌టు నానా హంగామా చేయ‌డం ఏమిట‌న్నారు.అయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏదో జరిగిందని తెలిసిన వెంటనే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నిద్ర పోయావా? గాడిదలు కాస్తున్నావా? దేవుడి సేవలో ఎన్నో ఏళ్ల పాటు ఉన్న నీవు అప్పుడు ఈ విషయం చెప్పలేదంటే,,నీవు దొంగ స్వామి అయినా అయ్యి ఉండాలి లేదా ఇందులో భాగస్వామివైనా అయి ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదంతా ఒక బజారు వ్యవహారమని తేల్చిపారేశారు.ఒకాయనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో నగలు ఉన్నాయని,మరొకరేమో దొంగతనం జరిగిందని,ఇంకొకాయన గునపాలతో అంతా తవ్వేశారని అంటారని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY