మత్స్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ స‌హాకారం-మంత్రులు

0
157

నెల్లూరుః మత్స్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని,రాష్ట్రంలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన‌ట్లు రాష్ట్ర స‌హాకార‌,వ్య‌వ‌సాయ‌శాఖ‌ మంత్రులు సీహెచ్.అదినారాయ‌ణరెడ్డి, సోమిరెడ్డి. చంద్ర‌మోహ‌న్‌రెడ్డిలు తెలిపారు.శుక్ర‌వారం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో రూ.5.33 కోట్లతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభించిన అనంత‌రం వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేయడంతో సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందజేస్తున్నారు..టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మత్స్య కళాశాల అభివృద్ధి, అదనపు వసతుల కల్పన జరిగిందని,మత్స్య రంగంలో ప్రముఖ హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు నెల్లూరు జిల్లాలోనే ఉండటం అభినందించిత‌గ్గ విష‌య‌మ‌న్నారు.వ్యవసాయం దాని అనుబంధ రంగాల వృద్ధిరేటు జాతీయ స్థాయిలో 6 శాతం ఉండగా ఏపీలో 17.6 శాతం ఉండటం అందరికీ గర్వకారణమ‌ని, అందులో 36 శాతం వృద్ధి రేటు ఆక్వారంగంలోనే ఉండటం గొప్ప విషయమ‌న్నారు.వ్యవసాయ రంగంతో పాటు మత్స్య రంగానికి సంబంధించిన అన్ని కోర్సుల్లో బాలుర కంటే బాలికల శాతం ఎక్కువగా ఉండటం శుభపరిణామని,మత్స్య విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామ‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ రవిచంద్ర, మస్తాన్ రావు,వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ వై. హరిబాబు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY