ఇలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలి-మంత్రి సోమిరెడ్డి 

0
275

నెల్లూరుః రాజకీయ భిక్ష పెట్టిన ఆనం కుటుంబాన్నేనీచమైన భాషతో తిట్టిన వ్యక్తికి నన్ను తిట్టడం లెక్క కాదని,ఖర్చు లేదనుకుని నోటికి ఏదొస్తే అది తిట్టడం రాజకీయం కాదని స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డిని ఉద్దేశిస్తు రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.శ‌నివారం గ్రామదర్శిని-గ్రామ వికాసంలో భాగంగా పొదలకూరు మండలం మొగళ్లూరు పంచాయతీలో పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకున్న మంత్రి పలు సమస్యల పరిష్కారంపై అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు,నూతన గృహ ప్రవేశాలు చేశారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ రూ.2.51 కోట్లతో మొగళ్లూరు పంచాయతీలో అభివృద్ధి చేసుకున్నమ‌ని,రూ.90 లక్షలతో మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సిద్దంమౌవుతున్నయ‌న్నారు.రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు నీళ్లు విడుదల చేసేలా కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. పొదలకూరు మండలం మీకు రాజకీయ భిక్ష పెట్ట‌డ‌డం వ‌ల్లే జ‌డ్పీ చైర్మన్,ఎమ్మెల్యే అయ్యారని అలాంటి నియోవ‌ర్గంకు చేసింది ఏమిట‌ని ప్ర‌శ్నించారు.కండలేరు లిఫ్ట్ కోసం టెండర్లు పిలింపించాలని ఒక్క రోజైనా జెడ్పీ మీటింగ్ లో కానీ,అసెంబ్లీలో కానీ కోరారా..చట్టసభలకు మాత్రం రారు కానీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి అధికార పక్షాన్ని,నన్ను,నా కుటుంబాన్ని తిట్టడమే వారి పని,ఆయన వాడుతున్నదుర్మార్గమైన భాష జిల్లా చరిత్రలో ఎన్నడూ ఏ నాయకుడు ఉపయోగించిన సందర్భం లేదని విచారం అభ్య‌త‌రం వ్య‌క్తం చేశారు.నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశార‌న్నవిష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు.నోటకొచ్చినట్టు మాట్లాడుతూ ఇంత దురదృష్టకరమైన రాజకీయాలు చేసే వారిని,రాజకీయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించే ఇలాంటి వారిని ఎక్కడా చూడలేదని,అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పారనే పేరు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తెచ్చుకోవాలని కోరారు.

LEAVE A REPLY