వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతలకు లేదు-సోమిరెడ్డి

0
173

నెల్లూరుః జిల్లాలో CJFS ను రద్దు చేసి దాని పరిధిలోని 95 వేల ఎకరాలను లబ్ధిదారుల వారసులైన 65 వేల దళిత, గిరిజన రైతు కుటుంబాలకు డిఫార్మ్ పట్టా కింద ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.సోమవారం స్దానిక జిల్లా టిడిపి కార్యాయ‌లంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ ఇటీవ‌ల జ‌రిగిన‌ క్యాబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.వారసులుగా ఆ భూమిని ఎవరైతే సాగుచేసుకుంటున్నారో వారి పేర్లు అడంగళ్, 1Bలో నమోదు చేయడంతో పాటు పాసుపుస్తకాలు జారీ చేసి అన్ని భూయాజమాన్య హక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. ఈ నిర్ణయం ద్వారా జిల్లాలోని దళిత,గిరిజన వర్గాల రైతులు లబ్ధి పొందుతర‌ని, మొత్తంగా 2.60 లక్షల మంది రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు.ఇప్పటివరకు 17వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర టిడిపి ప్రభుత్వానిదని, బిందు,తుంపర్ల సేద్యంలోగుజరాత్‌ను పక్కకు నెట్టి ఏపీని మొదటిస్థానంలో తీసుకువచ్చామ‌న్నారు.వ్యవసాయం విషయంలో గత ప్రభుత్వాలు పదేళ్లలో వెచ్చించిన నిధులకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మా ప్రభుత్వం వెచ్చిస్తోందని, ఏ పథకంలోనూ దళారుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా నిధులు ఖర్చుపెడుతున్నాట్లు తెలిపారు.అకాలవర్షాలతో మార్చి, ఏప్రిల్ లో రైతులకు 102కోట్ల నష్టం వచ్చింది, వారిని అదుకునేందుకు చర్యలు చేపడుత‌న్న‌మ‌ని,వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతలకు లేద‌న్నారు.ఈ స‌మావేశంలో టిడిపి జిల్లా అధ్య‌క్ష‌డు బీదా.రవిచంద్ర‌,నూడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి.త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY