క‌నీస‌మ‌ద్దతు ధ‌ర‌కన్నా తగ్గించి మిల్ల‌ర్లు ధాన్యం కొంటే చ‌ర్య‌లు-సోమిరెడ్డి

0
147

నెల్లూరుః రైస్‌మిల్ల‌ర్లు ధాన్యం కొనుగొలు విష‌యంలో క‌నీస‌మ‌ద్దతు ధ‌ర‌కన్నా తగ్గించి కొన‌డాన‌కి వీలులేద‌ని,అలా త‌గ్గించి కొన్న రైస్‌మ‌మిల్ల‌ర్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొవ‌డం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.సోమ‌వారం స్దానిక ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించినంతరం అయ‌న మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మార్చి మాసాంతంలో కురిసిన మంచు వ‌ల్లా (బి.పి.టి) ధాన్యం కొంత‌మేర ఇరుగుడుకు గురైంద‌ని,పౌర‌స‌ర‌ఫ‌రా సంస్ధ ద్వారా కొనుగొలుకు ప్ర‌భుత్వం ఆదేశించిన‌ప్ప‌టికి ప్ర‌భుత్వ ఆదేశాలు ఆమ‌లులో ఆల‌సత్వం ప‌నికిరాద‌ని అయ‌న హెచ్చిరించారు.ధాన్యం పుట్టి 15,300 ల‌కు కొనుగొలు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.రైతుల శ్రేయ‌స్సును దృష్టిలో వుంచుకొని అధికారులు నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేయాల‌ని,రైతుల‌ను ఇబ్బంది పెడితే త‌గు చ‌ర్య‌లు తీసుకొవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఈ స‌మావేశంలో ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY