రైతులంటే నిర్వచనం తెలియని వాళ్లు కూడా ? -మంత్రి సోమిరెడ్డి

0
226

నెల్లూరుః రైతులంటే నిర్వచనం తెలియని వాళ్లు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని,టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత ఆయకట్టు పెరిగిందో తెలుసుకుని మాట్లాడాల‌ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్‌రెడ్డి వైకాపా నేత‌ల‌కు హిత‌వు ప‌లికారు.సోమ‌వారం తోటపల్లి గూడూరు మండలం పేడూరులోని పలు వీధుల్లో రూ.32 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అధికారులు,టీడీపీ నేతలతో కలిసి భూమి పూజ చేసినంత‌రం నంత‌రం తోటపల్లి గూడూరు మండలం తోటపల్లిగూడూరు సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.తోటపల్లి గూడూరు సొసైటీ ప్రగతిపథంలో నడుస్తోందని సోసైటీ స‌భ్యుల‌ను అభినందించారు సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని,గత ప్రభుత్వం కండలేరు జలాలను తరలించేందుకు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు కూడా ఇస్తే మీరు నిద్రపోతున్నారంటు ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY