వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి-మంత్రి సోమిరెడ్డి

0
65

ప్రతి పదిహేను రోజులకొకసారి సమీక్ష.నెల్లూరుః గత ఏడాది ఏడాది 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది 3 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించమ‌ని,ఆయకట్టుకు నీళ్లు ఇవ్వని చెరువులను కూడా మూడో వంతు నింపి తాగునీటి సమస్య లేకుండా చూడాలని నిర్ణయించిన‌ట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.శుక్ర‌వారం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై నెల్లూరు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ ఆర్‌.ముత్యాలరాజుతో క‌ల‌సి సమీక్ష నిర్వహించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ తాగునీటి కోసమే కేటాయింపులను 6 నుంచి 7 టీఎంసీలకు పెంచామ‌న్నారు.వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్నమ‌ని,
అవసరమైన ప్రాంతాల్లో ప్రజలతో పాటు పశువులకు కూడా తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ‌న్నారు.తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని,అధికారులందరూ టీం వర్క్ చేసి సాగునీటి పంపకాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించిన‌ట్లు తెలిపారు.ప్రతి పదిహేను,ఇరవై రోజులకొకసారి సమీక్ష నిర్వహిస్తామ‌న్నారు.కరువును ఎదుర్కొనే విషయంలో అధికారులు పంపే ప్రతిపాదనలను ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని,పశుగ్రాసం పంపిణీ విషయంలోనూ ఇబ్బందులు లేకుండా చేస్తామ‌ని చెప్పారు.పశుగ్రాసం కోసం అధికారులు రూ.39 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రస్తుతం రూ.4.5 కోట్లు మంజూరు చేశమ‌ని,ఆరేడు నెలల్లో మిగిలిన మొత్తం కూడా విడుదల చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చేస్తామ‌న్నారు.స‌మీక్షా స‌మావేశంలో వివిధ‌శాఖాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY